BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో నేడు (బుధవారం) కీలక విచారణ సాగింది. బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, విచారణ వాడివేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున లాయర్ సుదర్శన్ వాదనలు వినిపించారు. అయితే, నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి విచారణ కాదు. అన్ని అంశాలను ఒకేసారి ప్రస్తావించవద్దు. మా ఓపికను…