* హైదరాబాద్: ఈ రోజు తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయుంపు
* నేటి నుంచి అమల్లోకి మహాలక్ష్మి పథకం.. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం..
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 54,523 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 20,817 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.4 కోట్లు
* ఇవాళ విజయవాడకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. రాయనపాడులో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్న నిర్మలా.. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రం లో కృష్ణవేణి సంగీత నీరాజనంలో పాల్గొననున్న నిర్మలాసీతారామన్..
* నేటి నుంచి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పునః ప్రారంభం.. తుఫాన్ హెచ్చరికలతో ఈ నెల 4 నుంచి పాదయాత్రకు విరామం.. నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలం శీలంవారిపాకల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేష్.. నేడు తుని నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న పాదయాత్ర
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ, జనసంద్రంగా మారిన రత్నగిరి.. తెల్లవారుజాము నుంచి స్వామి వారి దర్శనం వ్రతాలకు అనుమతి.. నిన్న ఒక్కరోజే సత్యదేవుడుని దర్శించుకున్న 60 వేల మంది భక్తులు
* కాకినాడ: నేడు సామర్లకోటకు మంత్రి రోజా.. భీమేశ్వర స్వామిని దర్శించుకోనున్న మంత్రి
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి వేణుగోపాలకృష్ణ
* బాపట్ల జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన. మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు కొనసాగనున్న పర్యటన.. తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడి, నష్టం వివరాలు తెలుసుకోనున్న చంద్రబాబు.. బాపట్ల నుంచి బయలుదేరి 11 గంటలకు పర్చూరు మండలం చెరుకూరులో దెబ్బతిన్న పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడనున్న చంద్రబాబు.. 12 గంటలకు చెరుకూరు నుంచి బయలుదేరి గండ్లు పడిన వాగులు, కాలువలు పరిశీలిస్తూ రమణాయపాలెం, కొమర్నేనివారిపాలెం, పోతుకట్ల మీదుగా వీరన్నపాలెం చేరుకోనున్న చంద్రబాబు.. అనంతరం 4 గంటలకు చిననందిపాడు వద్ద పైర్లు పరిశీలించి అక్కడ నుంచి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు వెళ్లనున్న చంద్రబాబు..
* ప్రకాశం : మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 2వ నంబర్ గేటును పరిశీలించనున్న టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్..
* ప్రకాశం : ఒంగోలు శ్రీగిరి కొండపై నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* పశ్చిమ గోదావరి: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల పర్యటనకు బయలుదేరుతారు. తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన పంటలను పరిశీలిస్తారు.
* ఏలూరు: నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ ..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. తోటపల్లి గూడూరు, పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురం లో స్థానికులతో జనసేన పార్టీ నేతల సమావేశం
* నెల్లూరు: కార్తీక మాసం సందర్భంగా బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపం లో మహాశివుడికి రుద్రాభిషేకం
* విజయనగరం: వేపాడ మండలం వీలుపర్తిలో నేడు జరిగనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టాల్స్ ఏర్పాటు.. ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ నుంచి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్న అధికారులు.
* అనంతపురం : కంబదూరు మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్లు నిర్మాణంకు స్ధానిక మీసేవ కార్యాలయంలో సమీపంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనంతపురం : నార్పల మండల కేంద్రంలో భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
* విశాఖ: నేడు కేంద్ర రైల్వే,కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పర్యటన.. సింహాచలం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలన.. విశాలాక్షి నగర్‌లో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్న కేంద్ర మంత్రి
* పల్నాడు: నేడు నరసరావుపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్..
* గుంటూరు: జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు గుంటూరు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయం వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన..
* విశాఖ: టైకూన్ జంక్షన్లో వీఐపీ రోడ్డు మూసివేతకు నిరసనగా జనసేన ధర్నా.
* అల్లూరి జిల్లా: ఏజెన్సీని వణికిస్తున్న చలి తీవ్రత, తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. పాడేరులో 14, మినుములూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.
* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమండ్రి క్యాంపస్ లో సౌత్ అండ్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2023-24 పోటీలు.. ప్రారంభించనున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీగా కార్తీక వన భోజన కార్యక్రమాలు.. పోలీసుల ఆంక్షలు. కోనసీమలో సెక్షన్ 30 ఈ నెల చివరి వరకు అమలు, డీజేలతో రోడ్లపై ఊరేగింపులకు అనుమతి లేదు.. సైలెన్సర్లు తీసి తిరిగే మోటార్ సైకిళ్ళను సీజ్ చేస్తాం. వ్యక్తులను, వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు నిషేధం-డీఎస్పీ అంబికా ప్రసాద్
* నేడు కాపుల వన భోజన కార్యక్రమం.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజన కార్యక్రమం…