KTR : గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే.. 20 శాతం కమీషన్ తప్ప.. విజన్ లేని ప్రభుత్వం ఇది
- గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లాగా ఉంది
- గత 15 నెలల అట్టర్‌ప్లాప్ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నాం
- రేవంత్ చేతకానితనం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి
- కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక ప్రెస్‌నోట్‌లా అనిపించిందని వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్ ప్రసంగాన్ని గాంధీభవన్ ప్రెస్‌మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు. గత 15 నెలల కాలంలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని, అసెంబ్లీ సమావేశాల్లో సుతారంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి.. కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. రుణమాఫీ కేవలం 30% మాత్రమే జరిగింది, మిగిలిన రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. “20% కమీషన్ తప్ప, ఈ ప్రభుత్వానికి ఎటువంటి విజన్ లేదు”, అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పుల చేస్తే.. రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష 13 వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్ అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం బాధాకరమని కేటీఆర్ మండిపడ్డారు.
Health Tips: వేసవిలో పిల్లలకు ఈ 4 ప్రత్యేక జ్యూస్‌లను ఇవ్వండి..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!