Team India: న్యూయార్క్‌లో భారత్.. టీ20 ప్రపంచకప్ 2024 వేట మొదలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Captain Rohit Sharma Practice for T20 World Cup 2024: యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు సన్నాహకంగా సోమవారం (మే 27) నుంచి వార్మప్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు న్యూయార్క్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఆధ్వర్యంలో రోహిత్ సేన సాధన చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, గిల్, హార్దిక్ పాండ్యా తదితరులు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్లేయర్స్ అందరూ ఫుట్ బాల్, వర్కట్స్ చేశారు. కోచ్ సోహమ్ దేశాయ్ అందరినతో వర్కట్స్ చేయించారు.
Also Read
Also Read: T20 World Cup 2024: కోచ్ మాత్రమే కాదు.. చీఫ్ సెలెక్టర్ కూడా ఫీల్డింగ్ చేశాడు!
అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో కలవలేదు. నేడు కింగ్ న్యూయార్క్‌కు చేరుకోనున్నాడని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 అనంతరం 2-3 రోజులు కుటుంబంతో గడిపిన విరాట్.. ఇప్పటికే ఫ్లయిట్ ఎక్కాడట. ఇక జూన్ 1న బంగ్లాతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ వేచి చుస్తున్నారు. మెగా టోర్నీలో పాల్గొనే 20 జట్లను ఐసీసీ 4 గ్రూపులుగా విభజించింది. గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి.
India’s first practice session in New York led by Rohit Sharma. 🇮🇳pic.twitter.com/Qc2sDjVVuQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!