Laxmi Parvathi: టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు పగ్గాలు ఇవ్వాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laxmi Parvathi: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై మరోసారి మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యం.. ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని విమర్శించిన ఆమె.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు.. ఎన్టీఆర్ మనవడుగా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. వాళ్లిద్దరికీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇక, టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేసిన లక్ష్మీపార్వతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని సూచించారు.
Read Also: Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే
Also Read
చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు లక్ష్మీపార్వతి.. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు.. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించారని విరుచుకుపడ్డారు. ఇక, లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారు.. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని.. అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పనికి మాలిన లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు.. అయినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా టీడీపీని నందమూరి ఫ్యామిలీకి అప్పగించాలి.. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూఇంచారు.. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆమె.. సినిమాలు చేసుకుంటున్న పవన్ ను తీసుకొచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నాడని ఆరోపించారు.. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్‌కి చెప్పానని గుర్తుచేసుకున్నారు లక్ష్మీపార్వతి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు