Fire Accident: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ నగరంలోని ఓ ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ భీకర అగ్నిప్రమాదంతో భవనం మొత్తం గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీడియో చూస్తుంటే బిల్డింగ్‌లోని కొన్ని అంతస్తులే కాదు మొత్తం బిల్డింగ్ నిప్పుల కుంపటిలా మారిపోయింది. కింది అంతస్తు నుంచి పై అంతస్తు వరకు మంటలు కనిపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
మంటలను అదుపు చేయడంలో పబ్లిక్ సెక్యూరిటీ, పోలీసు బృందాలు చాలా వరకు విజయం సాధించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. భవనంలో నివసిస్తున్న ప్రజలను బయటకు తీసి, వారిని అజ్మాన్చ,షాజాలోని హోటళ్లకు తరలించారు.
Large fire erupts at residential high-rise in Ajman, UAE. pic.twitter.com/6BTO5gRTkE
— Jack Straw (@JackStr42679640) June 26, 2023
Read Also:Benefits of Bottle Gourd: ఈ కూరగాయల రసం తాగితే.. కీళ్ల నొప్పుల సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళం ఎంత కష్టపడిందో చూడవచ్చు. భవనంలోని పలు అంతస్తుల్లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇది ఎత్తైన భవనం కావడంతో భవనం పైభాగంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు.
BREAKING: Residential high-rise building in Ajman, the United Arab Emirates is currently on fire.#FIRE #UAE #Ajman pic.twitter.com/PbOSt1x8Kn
— Nitesh rathore (@niteshr813) June 27, 2023
Read Also:Indian Army: హింస అదుపుకు ప్రజలు సహకరించాలిః ఇండియన్ ఆర్మీ విజ్ఞప్తి
వైరల్ వీడియోలో భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రజలు దూరంగా నిలబడి మొబైల్‌లో వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. అయితే భవనంలో మంటలు ఎలా చెలరేగాయి, దానికి గల కారణాలేమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.