IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి.. పాక్ జట్టులో భారీ మార్పులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టు తీవ్ర గందరగోళం పడిపోయిందట.. 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెద్ద మార్పులు జరగనున్నాయి. బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది తదితర సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టి, యంగ్ క్రికెటర్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
సీనియర్ క్రికెటర్ల కెరిరీపై ప్రశ్నలు..
2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగిన ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్‌లో ప్రకంపనలు సంభవిస్తున్నాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తదుపరి సీనియర్ ఆటగాళ్లను మ్యాచ్‌లకు దూరం పెట్టే అవకాశం ఉంది. జట్టు యాజమాన్యం, సూపర్ 8 దశలో విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోనుందట..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
PCB అధికారి అసంతృప్తి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో జరిగిన మ్యాచ్ తర్వాత, కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం నుంచి ముందుగానే బయలుదేరి వెళ్లడం ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోర్డు పెద్ద మ్యాచ్‌లలో ఇలాంటి ప్రదర్శన అంగీకరించరాని సందేశాన్ని జట్టు మేనేజర్‌కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెడ్ కోచ్ మైక్ హెస్సన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు తీవ్రంగా మందలించినట్టుగా సమాచారం.. జట్టు తన సామర్థ్యం మేరకు ప్రదర్శన ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పారట… ఆ రాత్రి సుదీర్ఘమైన జట్టు నిర్వహణ సమావేశం జరగగా.. ఇందులో మార్పులు చేయాలనే నిర్ణయం దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది..
యువ ఆటగాళ్లకు అవకాశం
నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం కొత్త ప్లేయింగ్ XIని రూపొందించడం, ఫఖర్ జమాన్ పునరాగమనం, యువ ఫాస్ట్ బౌలర్ల ప్రవేశం వంటి మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. నసీమ్ షా వంటి ఎంపికలను కూడా పరిశీలిస్తారు. రాబోయే టోర్నమెంట్ కోసం మిడిల్ ఆర్డర్‌లో కొత్త ఆటగాళ్లను ప్రయోగించడం లక్ష్యంగా పెట్టుకుందట బోర్డు… అయితే, పాకిస్తాన్ ఇప్పటికే USA మరియు నెదర్లాండ్స్‌లను ఓడించింది, కానీ భారత్‌పై ఘోర పరాజయాన్ని మూఠగట్టుకుంది.. దీంతో, నమీబియాతో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇక్కడ ఓడితే మాత్రం సూపర్ 8కు దాదాపు దూరమైనట్టే.. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18న జరుగనుంది.
భయపెట్టిన ఆటగాళ్లు
భారత్‌తో మ్యాచ్‌లో షాహీన్ ఖాన్ రెండు ఓవర్లలో 31 పరుగులకు ఒక వికెట్ పడగొట్టగా, షాదాబ్ ఖాన్ ఒక ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చాడు. బాబర్ ఆజం ఐదు పరుగులకే ఔటయ్యాడు. షాదాబ్ 14, షాహీన్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారతదేశంతో ఘోర పరాజయం తర్వాత ఈ మూడు అనుభవజ్ఞుల ఆటగాళ్లపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు పాక్ అభిమానులు..
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!