దళితుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానికా ప్రజా ప్రతినిధిగా తమరు గెలిచింది? ఎక్కువ దోపిడీలు చేశారనా ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రమోషన్ ఇచ్చారు?’ అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం నాడు పర్యటించారు. పర్యటనలో ముందుగా శలపాడు, వీర నాయకుని పాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా పరిశీలించారు.
Read Also: Ariaana Manchu: విష్ణు కూతురిలో ఈ టాలెంట్ ఉందా?.. ఫ్యూచర్ స్టార్ అవ్వడం పక్కా..
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ఈ ప్రభుత్వం ఆక్రమించుకొని మరి తవ్వుకు పోతుందన్నారు. దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి 30 లక్షల రూపాయల చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయునిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవే.. మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వందల కొద్దీ అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయన్నారు. కనీసం పంట పొలాలకు కూడా నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదన్నారు. సకాలంలో నీరు అందక 40 క్వింటాళ్లు పండాల్సిన మొక్కజొన్న, తదితర పంటల దిగుబడి నేడు 10 క్వింటాళ్లకు పడిపోయిందని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
Read Also: Pithapuram: పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయకపోతే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా..
మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షలు చొప్పున వసూలు చేయడమే గాక గడిచిన నాలుగున్నర ఏళ్లలో రూ. 2,100 కోట్లను ఈ వైసీపీ నాయకులు మింగేశారని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. అదే సొమ్మును నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణానికి గాని డ్రైనేజీల నిర్మాణానికి గాని ఉపయోగించి ఉంటే ప్రజాజీవనం బాగుపడేదని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని సపోటా, మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావెల్ అక్రమ సరఫరా చేస్తున్న ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.. తవ్విన అక్రమ గ్రావెల్ ను రియల్ ఎస్టేట్, డెవలప్ మెంట్లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. అలాగే అక్రమ రవాణాలో భాగంగా కొట్టుకుపోయి.. భారీ గుంతలు ఏర్పడ్డ రోడ్లను కూడా పెమ్మసాని పరిశీలించారు. కనీసం మనుషులు నడవడానికి కూడా ఆ రోడ్లు పనికిరాకుండా పోయాయని ఈ సందర్భంగా స్థానికులు పెమ్మసాని వద్ద వాపోయారు.
Read Also: CM Siddaramaiah: నేను బలమైన సీఎంని, నీలాగా బలహీన పీఎంని కాదు.. మోడీపై విమర్శలు..
ఇక, ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కిలారు రోశయ్య దోపిడీలు కల్లారా చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమసాని చంద్రశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదు.. మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీనే ధ్యేయంగా, సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ దుగ్గిరాల సీతారామయ్య, శలపాడు, వీరనాయకునిపాలేం తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన ముందుకు సాగి వేజెండ్లలో పెమ్మసాని పర్యటించారు.