Kuna Ravi: తమ్మినేని కామెంట్లపై కూన రవి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు.
తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన విమర్శలు చేశారు కూన రవి. టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే రోజులు దగ్గరపడ్డాయి. ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. వైసీపీని పడగొట్టడానికి రెడీగా ఉన్నారు. తన చితికి తానే వైసీపీ నిప్పు పెట్టుకుంటోందన్నారు కూన రవి. వైసీపీ సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రలో భాగంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ సీఎం జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని అన్నారు.
Also Read
- Ram Mohan Naidu: 'పీ4' విధానంలో శ్రీకాకుళం జిల్లాకు 'ఎ' గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపైన విమర్శలు చేశారు తమ్మినేని. రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అల్లర్లకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. మహానాడు కాదు వల్లకాడు అంటూ తమ్మినేని నిప్పులు చెరిగారు. అమలాపురంలో దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా లేదా ప్రతిపక్ష పార్టీలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు.
రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని, రాబోయే ఎన్నికలనాటికి టీడీపీ కనిపించకుండా పోతుందని తమ్మినేని పేర్కొన్నారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు చేస్తున్నారని.. జగన్మోహన రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోతున్నాయని తమ్మినేని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని..స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై కూన రవి, వర్ల రామయ్య తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు మతిభ్రమించిందని.. అందుకే మహానాడును వల్లకాడుతో పోలుస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. పసుపు కండువా కప్పుకొనే చస్తానని ప్రగల్బాలు పలికి.. నయ వంచకుడి పక్కన చేరి పిచ్చిగా మాట్లాడడం సరికాదని వర్ల రామయ్య హితవు పలికారు.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!