గోబీ పేరు వినగానే అందరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. గుమ గుమ లాగే వాసన, రుచి అందరికి గుర్తుకు రావడం కామన్.. అయితే ఇప్పుడు బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..తమిళనాడు ప్రభుత్వం.. రీసెంట్ గా కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలను బ్యాన్ చేసేసింది.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తుంది… అంతేకాదు పీచు మీఠాయిని కూడా బ్యాన్ చేశారు..
గోబీని తయారు చేసేది కేవలం కూరగాయలతో అనే సందేహం అందరికి రావడం కామన్.. ఇంట్లో చేసుకొని కూడా తినకూడదా అనే డౌట్ వస్తోందా..? అసలు ఎందుకు బ్యాన్ చేశారు..? అసలు తినొచ్చా..? తినకూడదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే గోబీని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..దీన్ని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. రోడమైన్-బి , టార్ట్రాజైన్ క్యాన్సర్ కారక సంకలితాలను ఉపయోగిస్తున్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. అందుకే ఇప్పుడు వాటిపై నిషేధం విధిస్తున్నారు.. ప్రభుత్వ నియమాలను ఉల్లఘించి అమ్మితే భారీ జరిమానాతో పాటుగా జైలుకు వెళ్తారని అధికారులు చెబుతున్నారు.. మన ప్రదేశాల్లోనూ అదే కలర్ కలుపుతూ ఉండొచ్చు. కాబట్టి.. బయట అమ్మే ఇలాంటి ఫుడ్ కి దూరంగా ఉండటమే మంచిది. మీకు మరీ తినాలని అనిపిస్తే.. ఎలాంటి ఆర్టిఫీషియల్ కలర్స్ లేకుండా మీరు ఇంట్లోనే చేసుకొని తినవచ్చు అని చెబుతున్నారు..