Central Home Minster Amit Shah Met Super Hero Teja Sajja and Hanuman Team in Hyderabad: దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలు కాబోతోంది. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండగా తెలంగాణలో మాత్రం లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హీరో తేజ సజ్జాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు.
Manchu Manoj: నా భార్య గర్భవతే కానీ.. ఆ వార్తలు నమ్మొద్దు.. మంచు మనోజ్ లేఖ!
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి హిట్ గా నిలవడమే కాదు దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక తేజ సజ్జాకి కూడా మంచి పేరు ఈ సినిమా తీసుకువచ్చింది. సినిమా రిసల్ట్ సూపర్ పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో తేజను అమిత్ షా అభినందించినట్లు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో మరో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇక హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా అమిత్ షాను కలిశారు. ఇక ఈ క్రమంలో హనుమాన్ ప్రతిమను అమిత్ షాకి బహుకరించారు. నిజానికి కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అంతా అత్యంత రహస్యంగా నడిచింది. అమిత్ ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారు? అనే అంశం మీద సొంత పార్టీ నేతలకే క్లారిటీ లేని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన అమిత్ షా ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవ్వలేదు. సీఏఏ నోటిఫై తర్వాత అమిత్ షా మొదటి పర్యటన ఇదే కావడంతో అంతా గోప్యంగానే జరిగిందని అంటున్నారు.