YSRCP: వైసీపీలోకి టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఓవైపు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడిపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రతీ రోజూ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయజనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కొందరు నేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నైట్ స్టే పాయింట్ వద్ద గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, మంగళిగిరి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు జగన్.
Read Also: Nagababu: అన్నీ సర్దుకున్నాయి.. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం..
Also Read
గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరశెట్టి సుబ్బారావు.. ఇక, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్ కో కన్వీనర్ డాక్టర్ టీవీ రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్ బైరా అజయ్‌బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్ షాజిత్ కూడా వైసీపీ గూటికి చేరినవారిలో ఉన్నారు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి గుంటూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఉస్మాన్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు.. సజ్జల రామకృష్ణా రెడ్డి.. తదితర నేతలు పాల్గొన్నారు.




తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!