ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు.
అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. 24వ తేదీన అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపును ఇచ్చాయి. అంగన్వాడీలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి.
అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు
రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. నగరంలోకి…
కార్మిక సంఘాల ఆందోళనల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. అంగన్వాడీలతో మరోసారి చర్చలు జరపనుంది ఏపీ ప్రభుత్వం.. అంగన్వాడీ సంఘాలకు ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వచ్చింది.. ఈ సాయంత్రం 3 గంటలకు చర్చలు జరపనున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .. ఈ చర్చలకు సచివాలయం వేదిక కానుంది..
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు.
అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది