Tata Altroz Facelift: టాటా మోటార్స్ మే 22న 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రారంభించగా.. ఇప్పుడు అధికారికంగా బుకింగ్ లకు ఆహ్వానం పలికింది. హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో మారుతీ బాలెనోకు గట్టి పోటీగా నిలిచే ఈ కొత్త వెర్షన్ బుకింగ్ కోసం రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో టాటా అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఈ కొత్త 2025 ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఫీచర్స్, ధరలను ఒకసారి చూద్దామా..
Read Also: Toyota: మెరుగైన మైలేజ్, అధునాతన పనితీరుతో కొత్త ఫార్చ్యూనర్, లెజెండర్ నియో వేరియంట్లు విడుదల..!
కొత్త 2025 టాటా ఆల్ట్రోజ్ మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అవే.. 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ iCNG టెక్నాలజీ (ట్విన్ సిలిండర్ టెక్) లు. అలాగే ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT), 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCA), 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ కూడా లభించనుంది. ఈ కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ బాడీ శైలి పాత మోడల్‌ను గుర్తుచేసేలా ఉండగా.. ముందుభాగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో పూర్తిగా LED హెడ్ ల్యాంప్స్, ఐబ్రో-స్టైల్ DRLs, కొత్తగా రూపొందించిన గ్రిల్‌పై టాటా మోనోగ్రామ్, కొత్త బంపర్ డిజైన్, సెగ్మెంట్ లోనే మొదటిసారి ఫ్లష్ డోర్ హాండిల్స్ మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇక అంతర్గత ఫీచర్లు (ఇంటీరియర్) విషయానికి వస్తే.. ప్రీమియం ఇంటీరియర్ లుక్ కోసం టాటా మోటార్స్ ఎన్నో అదనపు ఫీచర్లను అందిస్తోంది. ఇందులో 10.25 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (Android Auto, Apple CarPlay సపోర్ట్‌తో), 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ HD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అంబియంట్ లైటింగ్, వాయిస్ ఎనేబుల్డ్ సన్ రూఫ్, వైర్ లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ లు అందించనున్నారు.
Read Also: Mount Etna: భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..!
ఇక టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూం ఆధారంగా అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.6.89 లక్షల నుండి ప్రారంభమై, SMART వర్షన్ రూ.6.89 లక్షలు, PURE వర్షన్ రూ.7.69 లక్షలు, CREATIVE వర్షన్ రూ.8.69 లక్షలు, ACCOMPLISHED S వర్షన్ రూ.9.99 లక్షల వరకు ఉంటాయి. 1.2 లీటర్ iCNG వేరియంట్ల ధరలు రూ.7.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇందులో SMART వర్షన్ రూ.7.89 లక్షలు, PURE రూ.8.79 లక్షలు, CREATIVE రూ.9.79 లక్షలు, ACCOMPLISHED S రూ.11.09 లక్షలు ధరగా ఉన్నాయి. అలాగే 1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ వేరియంట్‌లో PURE వర్షన్ రూ.8.99 లక్షలు, ACCOMPLISHED S వర్షన్ రూ.11.29 లక్షలు ధరలతో అందుబాటులో ఉన్నాయి.