Toyota: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన ప్రఖ్యాత SUV మోడల్స్ ఫార్చ్యూనర్, లెజెండర్ నియో డ్రైవ్ 48V వేరియంట్లలో వాహనాలను విడుదల చేసింది. అత్యాధునిక 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ కొత్త వేరియంట్లు మెరుగైన ఇంధన సామర్థ్యం, మృదువైన డ్రైవింగ్ అనుభవం, మంచి రైడింగ్ అనుభూతిని అందించనున్నాయి.
Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్
ఈ కొత్త నియో డ్రైవ్ వేరియంట్లలో 2.8 లీటర్ల 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజన్‌కు 48V సిస్టమ్‌ను జోడించారు. ఇది బెల్ట్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, లిథియం అయాన్ బ్యాటరీతో కూడిన మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీనివల్ల తక్కువ వేగంలో కూడా ఎక్సలరేషన్, తక్కువ శబ్దంతో ఇంజన్ నడక, ఇంకా మెరుగైన ఇంధన సామర్థ్యం లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇక లెజెండర్ మోడల్‌ను డ్యూయల్ టోన్ బాడీ కలర్స్, స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంపులు, మరింత స్లీక్ ఫ్రంట్ ఫేషియా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఫోర్ట్యూనర్, లెజెండర్ రెండూ డ్యూయల్ టోన్ లెదర్ అప్‌హోల్‌స్టరీ, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, సౌకర్యవంతమైన ఎర్గోనామిక్ సీటింగ్ తో మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.
Read Also: Polavaram-Banakacherla Project: పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్పై కేంద్ర ఆర్థికశాఖ అధికారుల భేటీ
ఈ మోడళ్లలో ఏకంగా 7 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్ ఉన్న ఫ్రంట్ సీటు బెల్ట్స్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఇవన్నీ ప్రయాణికులకు పూర్తి భద్రతను అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇక వీటి ధరల వివరాలు చూస్తే.. టొయోట ఫార్చ్యూనర్ నియో డ్రైవ్ 48V కారు రూ. 44.72 లక్షలు (ఎక్స్-షోరూం)గా, టొయోట లెజెండర్ నియో డ్రైవ్ 48V ను రూ. 50.09 లక్షలు (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు.