రేపటి నుండి సీపీఎం రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించారు. దేశానికి బీజేపీ.. తెలంగాణకు టీఆర్ఎస్ ప్రమాదకరమన్నారు.
బీజేపీ…టీఆర్ఎస్ రెండు పార్టీలు మాకు సమానమేనన్నారు. ఈ మధ్య కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం స్వాగతించదగిన అంశం అని ఆయన పేర్కొన్నారు.
Read Also: సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల నిర్మాణంలో కొంత మేరకు విఫలమైన మాట వాస్తవం అన్నారు. రెండు విడతలుగా పార్టీ కార్యదర్శిగా సంతృప్తి కరంగానే పని చేశాశని ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ కార్యదర్శి అవుతానా లేదా అనేది చెప్పలేనని తెలిపారు. పార్టీ రాష్ట్ర మహాసభ నిర్ణయం చేస్తుందన్నారు. రాజకీయ తీర్మానం లో పార్టీ రాజకీయ ఎత్తుగడ పై చర్చించనున్నట్టు తమ్మినేని వీరభద్రం మీడియాకు వెల్లడించారు.