రిపబ్లిక్ డే వేడుకలకు సంబంధించి తెలంగాణలో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారం చివరికి హైకోర్టుకెళ్లడం.. న్యాయస్థానం సైతం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గవర్నర్‌కు.. బీజేపీకి, బీజేపీ ఎమ్మెల్యేలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ కంటివెలుగు కార్యక్రమానికి వస్తానంటే ఎవరైనా ఆపారా?అని ఆయన ప్రశ్నించారు. ఏ వేడుకలైనా చట్ట ప్రకారం జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. నోరు ఉందిగా అని ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : Shaakuntalam: ఋషివనంలో శకుంతలతో దుష్యంతుడి రొమాన్స్..
బర్త్ డే వేడుకల కోసం సెక్రటేరియట్ కట్టలేదు… ఏ కట్టడం అలా కట్టరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని తన బర్త్ డే రోజే సికింద్రాబాద్ వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానంటే ఎవరైనా అడ్డుకుంటారా? అని ఆయన అన్నారు. ఎవరి డ్యూటీ ఏంటో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని, రాజ్యాంగంలో ప్రధాని, సీఎం, గవర్నర్ రోల్ ఏంటో మోడీ వివరించాలన్నారు మంత్రి తలసాని.
Also Read : Minister Roja: అక్కినేని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన రోజా.. బాలయ్య శిక్షార్హుడు..?