వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి.