Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- 2019 అయోధ్య తీర్పుపై నటి స్వరా భాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు.
- ఆ తీర్పు తనకు అన్యాయంగా అనిపించిందని స్వరా వెల్లడి.
- తీర్పు తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్ చేశానని వ్యాఖ్య.
- షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లకు కూడా మెసేజ్ చేసినట్లు వెల్లడి.
- ఒక హిందువుగా తాను క్షమాపణ చెప్పాలనుకున్నానని స్వరా వ్యాఖ్య.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swara Bhasker: వివాదాలు, హిందూ వ్యతిరేకతకు కేరాఫ్‌గా ఉన్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను బాధపడ్డానని, తీర్పు వెలువడిన తర్వాత తన ముస్లిం స్నేహితులకు మెసేజ్‌లు చేసి క్షమాపణలు చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
‘‘రామ జన్మభూమి తీర్పు వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఇది ఇలాంటి దేశమా అని ఆశ్చర్యపోయా. ఆ నిర్ణయం నాకు అన్యాయం అనిపించింది. నా ఫోన్ లో ఉన్న ప్రతీ ముస్లింకు మెసేజ్ చేశా. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాశన్, అమీర్ ఖాన్, ఫహద్ అహ్మద్ ఇలా అందరికీ క్షమాపణలు చెప్పాను. ఒక హిందువుగా, నాకు తెలిసిన ముస్లింలందరికీ నేను క్షమాపణలు చెప్పాలనుకున్నా. సుప్రీంకోర్టు తీర్పుతో నేను సిగ్గుపడ్డాను. ఆ తీర్పుతో నేను ఏకీభవించను’’ అని స్వరా భాస్కర్ చెప్పింది.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
స్వరా భాస్కర్ వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్ అయిన వెంటనే ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. చాలా మంది ఆ వ్యక్తికి చరిత్ర తెలియదా.? అని ప్రశ్నించారు. ‘‘జై శ్రీరామ్’’ అంటూ కామెంట్ చేశారు. పాడ్‌కాస్ట్‌లకు స్వరాను ఎందుకు పిలుస్తున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫహాద్‌తో ఆమె పెళ్లిని కూడా ప్రజలు ట్రోల్ చేశారు. 2019లో, వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణానికి ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తున్న ఆమెపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని మరికొందరు డిమాండ్ చేశారు.
SWARA felt sorry for the Ram Janmabhoomi verdict.
We feel sorry for Swara.She saw a court order.
We saw Ram.Only Punyatmas can see Him. pic.twitter.com/zaJDX4GCS9
— Āyudhika (@Ayudhika1310) September 16, 2026
తాజావార్తలు
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!