Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- అమెరికా డ్రోన్ కంపెనీతో పాకిస్తాన్ సైన్యం ఒప్పందం..
- ట్రంప్ కుమారులకు ఈ కంపెనీలో పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యం, అమెరికాకు చెందిన డ్రోన్ కంపెనీ ‘పవరస్’’తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్లకు సంబంధించిన ఆర్డర్లతో పాటు, ఎంఓయూ కుదుర్చుకున్నట్లు పవరస్ కో ఫౌండర్ బ్రెట్ వెలికోవిచ్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌తో సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ కుమారుకుల పెట్టుబడులు కలిగిన ఆరియస్ గ్రీన్వే హోల్డింగ్స్ అనే కంపెనీలో త్వరలో పవరస్ విలీనం కాబోతోంది. విలీనం తర్వాత ఏర్పడే కంపెనీలో వీరికి 9.9 బెనిఫిషియల్ ఓనర్‌షిఫ్ వాటా కలిగి ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ ప్రారంభంలో ఈ రెండు కంపెనీల విలీనం కాబోతున్నాయి.
పవరస్ ప్రతినిధులు బృందం బ్రెట్ వెలికోవిచ్ నేతృత్వంలో పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో సమావేశమైనట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ భేటీలో రక్షణ కొనుగోళ్లు, ఉత్పత్తి, దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు పాక్ తెలిపింది. పవరస్ సీఈఓ ఆండ్రూ ఫాక్స్ ప్రకారం.. పాకిస్తాన్ ప్రైవేట్ రక్షణ రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, అమెరికా కంపెనీ అక్కడ వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికా-పాకిస్తాన్ సాంకేతిక సామర్థ్యాలతో జాయింట్ టెక్నికల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని పవరస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే, పవరస్ వ్యాపార విస్తరణలో ట్రంప్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని సీఈఓ ఆండ్రూ పాక్స్ తెలిపారు. ఒప్పందాలు వ్యాపార ప్రాతిపదికన, మెరిట్ ఆధారంగా లభిస్తాయని చెప్పారు. ట్రంప్ జూనియర్ ఒక పాసివ్ ఇన్వెస్టర్ మాత్రమే అని తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ ఒప్పందాన్ని అమెరికా, పాకిస్తాన్ మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఉపయోగపడుతుందని అసిమ్ మునీర్ ప్రశంసిొంచారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!