Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు అమెరికా నుంచి మరోసారి హెచ్చరిక.
- విధానం మార్చుకోవాలని రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ వార్నింగ్.
- రష్యాపై ఆంక్షల బిల్లుకు యూఎస్ చట్టసభ ఆమోదం.
- రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Oil: అమెరికా కాంగ్రెస్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై 100 శాతం టారిఫ్ ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెండు దేశాలనను అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీసుకువస్తోంది. ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారీ ఆర్థిక చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి.
రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ భారత్, చైనాలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ విధానాన్ని మార్చుకోండి, చమురు, గ్యాస్ వేరే చోట నుంచి కొనండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాపై ఒత్తిడి తీసుకువచ్చి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడమే ఈ ఆంక్షల లక్ష్యమని బ్లూమెంటాల్ చెప్పారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అమెరికా కాంగ్రెస్ బుధవారం రష్యా, ఇరాన్‌పై ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ట్రంప్ సంతకమే మిగిలుంది. బిల్లులో రష్యా అధికారులు, బ్యాంకులు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకుంటూ రష్యా చమురును రవాణా చేస్తున్నట్లు భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై చర్యలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఇదే కాకుండా రష్యా చమురు, సహజవాయువుపై ఆధారపడే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు టారిఫ్ వేసే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తుంది. అయితే, ఈ టారిఫ్‌లు ఆటోమెటిక్‌గా అమలులోకి రావు. ఈ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ఎలా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మరోవైపు, భారత్ అమెరికా చర్యలపై ఘాటుగా స్పందించింది. దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రతే తమ ప్రధాన లక్ష్యమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వివిద దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని భారత్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, రష్యా తన చమురును డిస్కౌంట్‌పై అమ్ముతోంది. అప్పటి నుంచి రష్యా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది.
भारत-चीन अपना रवैया सुधारो और कहीं और से तेल खरीदो: 100% टैरिफ बिल के बाद अमेरिकी सीनेटर
रूस से तेल खरीदने वाले देशों पर 100% टैरिफ लगाने वाला बिल पास होने के बाद अमेरिकी सीनेटर Richard Blumenthal ने भारत और चीन को खुली धमकी दी है।
Blumenthal ने कहा कि भारत और चीन अपना रवैया… pic.twitter.com/woY1Ua1OQN
— RT Hindi (@RT_hindi_) September 17, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!