Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- తమిళనాడులో మరోసారి ‘‘సనాతన ధర్మం’’పై వివాదం..
- పెరియార్ సనాతనానికి వ్యతిరేకం అంటూ విజయ్ ప్రభుత్వంలోని మంత్రి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanatana Row: తమిళనాడులో మళ్లీ ‘‘సనాతన ధర్మం’’పై వివాదం చెలరేగింది. రాష్ట్రంలో పెరియార్ ఈవీ రామసామి జయంతి సందర్భంగా సామాజిక న్యాయశాఖ మంత్రి, విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) సీనియర్ నేత వన్ని అరసు మాట్లాడుతూ.. ‘‘పెరియార్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు’’ అని అన్నారు.‘‘సనాతన ధర్మం విషయంలో పెరియార్ ఎలాంటి రాజీకి సిద్ధంగా ఉండేవారు కాదు, సనాతన ధర్మం నుంచి తమిళనాడును రక్షించేందుకు తమ పార్టీ ప్రతిజ్ఞ చేస్తుంది’’ అని వన్ని అరసు వ్యాఖ్యానించారు. విజయ్ టీవీకే ప్రభుత్వంలో వీకేసీ ప్రధాన భాగస్వామిగా ఉంది.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాలు, చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అన్నారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, వన్ని అరసు వ్యాఖ్యలపై సీఎం విజయ్ స్పందించాలని డిమాండ్ చేవారు. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే, హిందూ మతాన్ని వ్యతిరేకించే వర్గాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని భావించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు.
Also Read
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ఈ వ్యాఖ్యలకు టీవీకే ప్రభుత్వం దూరంగా ఉంది. టీవీకే అధికార ప్రతినిది అమెరికై నారాయణన్ మాట్లాడుతూ.. వన్ని అరసు తమ పార్టీ తరుఫున మంత్రిగా మాట్లాడలేదని, ఆయన మరో పార్టీ నేత అని వివరణ ఇచ్చారు. సీఎం విజయ్ కృష్ణ జన్మాష్టమి, గణేశ్ చతుర్థి సందర్భంగా తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారని గుర్తుచేశారు. పెరియార్‌ను తాము గౌరవిస్తామని, అయితే ఆయన చేసిన దేవుడి వ్యతిరేక వ్యాఖ్యల్ని సమర్థించబోమని నారయణన్ తెలిపారు.
తాజావార్తలు
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!