NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల తాత్కాలిక క్యాలెండర్‌ను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. డిసెంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు నిర్వహించనున్న ప్రధాన ప్రవేశ, అర్హత పరీక్షల తేదీలను ఇందులో పొందుపరిచారు. విద్యార్థులు తమ ఉన్నత చదువులు, పోటీ పరీక్షల సన్నద్ధతను మెరుగ్గా ప్రణాళిక చేసుకునేందుకు ఈ షెడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంజనీరింగ్ ఆశావహుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main) 2027 సెషన్-1 పరీక్షలను జనవరి 22 నుండి 24 వరకు, అలాగే జనవరి 28 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి జనవరి 31ని బఫర్ తేదీగా కేటాయించారు. ఇక ఇతర ప్రధాన పరీక్షల షెడ్యూల్ పరిశీలిస్తే.. డిసెంబర్ సైకిల్ యూజీసీ నెట్ (UGC-NET) పరీక్షలు డిసెంబర్ 14 నుంచి 19 వరకు జరగనుండగా, డిసెంబర్ 20, 21 తేదీలను బఫర్ రోజులుగా ఉంచారు.
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ (Joint CSIR-UGC NET) పరీక్ష డిసెంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే నిఫ్ట్ (NIFT) ప్రవేశ పరీక్ష జనవరి 10న, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) ఫిబ్రవరి 7న జరగనున్నాయి. పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ (CUET PG) పరీక్షలను మార్చి 1 నుంచి 25 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ఈ తేదీలు తాత్కాలికమైనవి మాత్రమేనని NTA స్పష్టం చేసింది. పరిపాలనాపరమైన, విద్యాపరమైన లేదా లాజిస్టికల్ కారణాల వల్ల వీటిలో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అధికారిక నోటిఫికేషన్లు, దరఖాస్తు ప్రక్రియ,ఇతర సమగ్ర వివరాల కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు NTA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!