హీరో అల్లు అర్జున్ పై సస్పెన్షన్‌కు గురైన ఏసీపీ విష్ణుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా పోలీసుల మీద నిందలు వేస్తున్నారు.. డబ్బు మదంతో ఓ హీరో పోలీసుల మీద అనుచిత మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఓ కేసులో ముద్దాయిగా ఉన్న హీరో ప్రెస్ మీట్ పెట్టవచ్చా అని ప్రశ్నించారు. కొన్ని ఘటనలను ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నాడని దుయ్యబట్టారు.