గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత కేసు బయటకు వచ్చింది. 13 ఏళ్ల విద్యార్థి 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భావతిని చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న SMIMER ఆసుపత్రిలోనే ఆ మహిళ గర్భస్రావం చేయాలని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అలాగే డీఎన్ఏ పరీక్ష కోసం పిండాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ లేడీ టీచర్ 22 వారాల గర్భవతి.
READ MORE: Rajnath Singh: మసూద్ అజార్‌కి రూ.14 కోట్లు ఇచ్చింది.. పాక్ టెర్రర్ ప్లాన్‌పై రక్షణమంత్రి వార్నింగ్..
సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 25న సూరత్‌లోని పూనా ప్రాంతంలో నివసిస్తున్న 13 ఏళ్ల విద్యార్థిని, 23 ఏళ్ల ట్యూషన్ టీచర్ కిడ్నాప్ చేసింది. వారిద్దరినీ వెతకడానికి పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి, ఏప్రిల్ 30న రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని ఓ బస్సులో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరూ జైపూర్ నుంచి అహ్మదాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల్లో ఐదు నగరాలను సందర్శించారు.
READ MORE: Deputy CM: ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. ఎంపీ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
అయితే.. వారిద్దరినీ పట్టుకున్న పోలీసులు పూనా ప్రాంతానికి తీసుకొచ్చారు. కాగా.. పోలీసుల విచారణలో సంచలన విషయం బయటకు వచ్చింది. ఆ బాలుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు.. తాను అతని ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వెళ్లేదానిని అని టీచర్ తన వాంగ్మూలంలో పేర్కొంది. తర్వాత, ఆమె విద్యార్థులను ట్యూషన్ కోసం తన ఇంటికి పిలవడం ప్రారంభించింది. ఈ తరుణంలో వీరిద్దరి మధ్య ఇలాంటి బంధం ఏర్పడిందట. ఈ 13 ఏళ్ల విద్యార్థి తనను గర్భావతిని చేశాడని టీచర్ చెప్పింది. చాలాసార్లు శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు టీచర్ తెలిపింది. తాము గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. దాదాపు ఒక సంవత్సరం పాటు ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతోందని టీచర్ ఒప్పుకుంది. ఈ విషయాన్ని మైనర్ బాలుడు కూడా అంగీకరించాడు. ఇటీవలే ఆమె గర్భవతి అని తెలిసింది. దీంతో చేసేదేమీ లేక ఆ విద్యార్థితో కలిసి పారిపోయింది.