Jagdish Devda : ‘‘ప్రజలు, సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి’’.. మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
- సైన్యం మోడీ పాదాలకు నమస్కరించాలి..
- మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
- ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM: ఇటీవల మధ్యప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేత విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదంతాన్ని మరిచిపోకముందే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీస్ దేవ్డా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సివిల్ డిఫెన్స్‌లో శిక్షణ కోసం వచ్చిన వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్రమోడీ పాదాలకు నమస్కరించాలి అని అన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో ఈ వ్యాక్యలు చేశారు. ‘‘పహల్గామ్‌లో పర్యాటకుల్ని వారి మతం ఆధారంగా వేరు చేయడం, మహిళల్ని పక్కన ఉంచి, పురుషుల్ని కాల్చి చంపడం మనం చూశాము. అప్పటి నుంచి ఈ దేశ ప్రజలు ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చే వారిపై ప్రతీకారం తీర్చుకునే వరకు విశ్రమించరు. ఈ రోజు దేశం మొత్తం, సైన్యం ప్రధాని మోడీ తీసుకున్న బలమైన చర్యకు ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. ఆయనకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి’’ అని దేవ్డా అన్నారు.
Also Read
Read Also: Ponguleti Srinivasa Reddy: భూములు ఉన్నవారికి రక్షణ కల్పించడమే భూ భారతి లక్ష్యం.
దీనికి కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా భారత ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆయనను తీవ్రంగా మందలించింది, ఆమెకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సాయుధ బలగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది.
‘‘మన సైనికులు దేషశాన్ని రక్షిస్తారు. రాజకీయ నాయకుల అహంకారాన్ని కాదు. భారత సైన్యం ప్రధాని మోడీ పాదాలకు నమస్కరిస్తారని చెప్పడం దారుణం మాత్రమే కాదు, ఇది మన సాయుధ దళాల త్యాగం, శౌర్యం, గౌరవానికి అవమానం. బీజేపీ నేత జగదీస్ దేవ్డా మాటలు అవమానకరమైనవి’’ అని యూత్ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ సుప్రియా శ్రీనేట్ ప్రధాని మోడీ ఆ బీజేపీ నేతను తొలగించాలని కోరారు.
Our soldiers protect the nation — not politicians’ egos.
Saying that the Indian Army bows at the feet of PM Modi is not just outrageous — it’s an insult to the sacrifice, valour, and dignity of our armed forces.
BJP leader Jagdish Devda’s words are disgraceful. pic.twitter.com/ApekeMnkop
— Goa Pradesh Youth Congress (@IYCGoa) May 16, 2025
తాజావార్తలు
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!