Colonel Sofiya Qureshi: ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.. మధ్యప్రదేశ్ మంత్రిపై సుప్రీం సీరియస్!
- మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు
- ముందెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్ షాకు ధర్మాసనం సూచించింది.
తాజాగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషీ మీడియాకు వెల్లడించారు. వివరాలను వెల్లడించిన సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాదుల సోదరి’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగడంతో.. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. మోవ్ తహసీల్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. సెక్షన్లు 152, 196(1)(b), 197(1)(c) కింద ఎఫ్ఐఆర్ నమోదయింది.
Also Read
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్.. ఆ ప్లేయర్స్ ఈ సీజన్ వరకే!
హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయ్ షా తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ క్షమాపణలు చెప్పారని, మీడియా ఆయన ప్రకటనను వక్రీకరించిందని తెలిపారు. అందుకు మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సీజేఐ ప్రశ్నించారు. మంత్రి పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మంత్రిపై దాఖలైన పిటిషన్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అంతేగాకుండా మంత్రి తీరును తప్పుపట్టింది. ముందెళ్లి క్షమాపణ చెప్పండి అని సూచించింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!