Supreme Court: నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.. కేంద్రం, NTAకు న్యాయస్థానం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజీ (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థ (NTAలకు అత్యున్నత కోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక చిట్కాలతో సరిపెట్టకుండా, వ్యవస్థాగతంగా ఎలాంటి శాశ్వత సంస్కరణలు చేపడుతున్నారో సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దడానికి కేవలం తాత్కాలిక చర్యలు మాత్రమే సరిపోవని, శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రశ్నపత్రాల రవాణాకు వైమానిక దళాన్ని వినియోగించడం వంటివి తాత్కాలికంగా ఉపయోగపడే మార్గాలు మాత్రమేనని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల ఫ్యూచర్‌తో చెలగాటం ఆడకుండా ఉండేందుకు ప్రతిపాదించిన గవర్నింగ్ బోర్డు, నిపుణుల బృందాలు, హైపవర్డ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏ విధంగా అమలు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు కోరింది. ప్రత్యేకించి డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరిశోధన, పరిపాలన, మానవ వనరులు సహా మొత్తం 10 కీలక విభాగాల్లో సాధించిన పురోగతి వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని NTAని ఆదేశించింది.
దీంతో పాటు, పరీక్షల సెక్యూరిటీ, పర్యవేక్షణ, విజిలెన్స్ కోసం ప్రత్యేకంగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్ పాత్ర, ఆయన పనితీరుపై కూడా నివేదిక కోరింది. పరీక్ష జరగడానికి ముందు, పరీక్ష జరుగుతున్నప్పుడు, పరీక్ష పూర్తయిన తర్వాత.. ఇలా ప్రతి దశలోనూ తీసుకుంటున్న రక్షణ చర్యలపై స్టేటస్ రిపోర్ట్ అందించాలని ఆదేశించింది. పరీక్షా కేంద్రాల ఎంపిక, ప్రశ్నపత్రాల ముద్రణ నుంచి వాటి రవాణా వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వాలని కోరింది. మరోవైపు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానానికి మారడం, విద్యార్థుల సమాచార రక్షణ (డేటా ప్రొటెక్షన్), అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ కోసం ‘డిజియాత్ర’ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే అంశాలపై కేంద్రం ప్రతిపాదనలు సవివరంగా చెప్పాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దాఖలైన అఫిడవిట్లో ఈ వివరాలేవీ స్పష్టంగా లేవని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయగా.. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, ఈ అంశాలన్నింటినీ చేర్చుతూ త్వరలోనే కొత్తగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు విన్నవించారు. కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా, ఈ సంస్కరణల అమలు తీరును ఏడాది పొడవునా తాము నిశితంగా పరిశీలిస్తూనే ఉంటామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తేల్చిచెప్పింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!