YS Viveka Case: సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వ్యవహారంపై వివేకా కూతురు సునీత.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు వాదనలు ముగిశాయి.. సుప్రీంకోర్టులో సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. ఎంపీ అవినాష్ రెడ్డి తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వానదలు విన్న సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది సుప్రీంకోర్టు.. అవినాష్ ముందస్తు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. మరోవైపు.. జూన్ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును ఈ సందర్భంగా పొడిగించింది సీజేఐ ధర్మాసనం.. కాగా, ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీత.. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై తొలిసారి విచారణ జరిగింది.. హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టిన సుప్రీం.. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది..
Read Also: Singer Sunitha: సింగర్ సునీత భర్తకు ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
ఇక, ఈ రోజు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.. అవినాష్‌రెడ్డికి లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను తప్పుబట్టిన ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను నిలిపివేసింది.. ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.. అయితే, ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపున లాయర్లు సుప్రీకోర్టును కోరారు.. ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.. మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్టు చేయొద్దని కోరారు.. అయితే, అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సీజేఐ స్పష్టం చేశారు.. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు. అసలు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారా? అని సుప్రీం ప్రశ్నించింది.. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటే సీబీఐ ఎప్పుడో ఆ పనిచేసేదని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.