Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Quash Petition: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టివేయాలని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ వేసిన విషయం విదితమే.
కాగా, సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.. 17ఏ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 17ఏ సెక్షన్ పరిధిలోని అంశాలను కోర్టు ముందుంచారు సాల్వే.. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు సార్వే.
Also Read
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు కొనసాగాయి.. 2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం అన్నారు.. విచారణ ముగిసిన తర్వాత పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచామని తెలిపారు.. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని స్పష్టం చేశారు.. తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాతే 2021లో కేసు నమోదు చేశారని వాదించారు.. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17 ఏ వర్తించదు అని అని ముకుల్ రోహత్గీ తన వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాంటి విచారణ సాగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!