DC vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Won The Toss And Chose To Field Against PBKS: ఐపీఎల్ 2023 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 59వ మ్యాచ్. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డీసీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింటిలో విజయం సాధించిన డీసీకి.. ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు సన్నగిల్లాయి. కానీ.. పంజాబ్ కింగ్స్‌కి మాత్రం ఈ మ్యాచ్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే.. 11 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన పంజాబ్‌కు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు ఇంకా ఉన్నాయి. మంచి రన్ రేట్‌తో అది వరుస విజయాలు నమోదు చేస్తే.. ప్లేఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి.. పంజాబ్‌కి ఈ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ సీజన్‌లో ఈ ఇరు జట్లు తలపడుతుండటం ఇదే మొదటిసారి. కాబట్టి.. ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Dinesh Gundurao : 105 ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి గుండూరావు
Also Read
- Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..

నిజానికి.. ఢిల్లీ జట్టులో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నప్పటికీ, మొదట్లో వాళ్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. అందుకే.. వరుసగా ఐదు పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. కానీ.. ఎప్పుడైతే వాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చారో, అప్పటి నుంచి డీసీ దశ తిరిగింది. కానీ.. దురదృష్టవశాత్తూ గత కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో.. ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. అయితే.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో, అవకాశం ఉన్న ఇతర జట్ల ప్లేఆఫ్స్ ఆశల్ని నీరుగార్చాలని భావిస్తోంది. అటు, పంజాబ్ కింగ్స్‌లోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు కానీ, నిలకడగా రాణించడం లేదు. ఎవరో ఒకరు అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నారే తప్ప.. అందరూ సమిష్టిగా ఆడటం లేదు. ఇప్పుడు ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి.. పంజాబ్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాల్సి ఉంటుంది. మరి.. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి, ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశల్ని డీసీ బుగ్గిపాలు చేస్తుందా? లేక పంజాబ్ రివర్స్‌లో డీసీని మట్టికరిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?