Lucknow Super Giants Won The Match By 7 Wickets Against SRH: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఎస్ఆర్‌హెచ్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 19.2 ఓవర్లలో 185 పరుగులు చేసి, లక్ష్యాన్ని ఛేధించింది. 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. మొదట్లో సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి లక్నో బ్యాటర్లను కట్టడి చేయడం చూసి.. ఈ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్‌దేనని అందరూ అంచనా వేశారు. కానీ.. అభిషేక్ శర్మ ఓవర్‌తో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అతడు 31 పరుగులు ఇవ్వడంతో, మ్యాచ్ లక్నోవైపుకు మళ్లింది. ఇక అక్కడి నుంచి లక్నో బ్యాటర్లు విరుచుకుపడటం, బౌలర్లూ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో.. గెలవాల్సిన ఈ మ్యాచ్‌ని చేజార్చుకోవాల్సి వచ్చింది.
DC vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఎవ్వరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు కానీ.. అభిషేక్ శర్మ (7) మినహా, క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడారు. క్లాసెన్ 47 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలవగా.. అబ్దుల్ సమద్ (37), అన్మోల్ ప్రీత్ (36), మార్ర్కమ్ (28), త్రిపాఠి 20) పరుగులతో రాణించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. మొదట్లో సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి.. లక్నో బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కైల్ మేయర్స్ అయితే 14 బంతుల్లో 2 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డీకాక్ (29) కొద్దిగా మెరుపులు మెరిపించి పెవిలియన్ బాట పట్టాడు.
Nikhil Gowda: యంగ్ హీరోకి తప్పని ఓటమి.. అమ్మ త్యాగం చేసినా..!
అప్పుడు క్రీజులో ఉన్న మన్‌కడ్, స్టోయినిస్.. ఆచితూచి ఆడారు. అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ.. జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు. ఇక మన్‌కడ్ మెల్లగా ఊపందుకుని.. తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఒక దశలో లక్నో స్కోరు 15 ఓవర్లలో 114/2 మాత్రమే ఉండేది. అప్పుడు లక్ష్యాన్ని ఛేధించాలంటే.. 5 ఓవర్లలో 69 పరుగులు చేయాలి. ఆ సమయంలో 16వ ఓవర్ వేసిన అభిషేక్.. ఏకంగా 5 సిక్స్‌లు సమర్పించుకున్నాడు. రెండు సిక్స్‌లు కొట్టి స్టోయినిస్ వెళ్లగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ వరుసగా మూడు సిక్స్‌లతో తాండవం చేశాడు. ఆ దెబ్బకు మ్యాచ్ లక్నోవైపుకు మళ్లింది. ఆ ఒత్తిడిలో హైదరాబాద్ బౌలర్లు కంట్రోల్ చేయలేకపోయారు. పూరన్ ఊచకోత కోసి.. లక్నో జట్టుని గెలిపించుకున్నాడు. ఈ ఓటమితో ఎస్ఆర్‌హెచ్ ప్లేఆఫ్ ఆశలు గంగలో కలిసిపోయాయి.