కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా వంటి చిత్రాలతో ప్రధాన నటుడిగా మారిన సుహాస్ తదుపరి ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాతో రానున్నాడు. షణ్ముక ప్రశాంత్ రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరీ ప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ఎంటర్‌టైనర్‌లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటుడు, రచయిత, దర్శకుడు అడివి శేష్ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఆవిష్కరించారు.
Also Read : Dhanush 50: తన 50వ సినిమాతో మరోసారి మెగాఫోన్ పట్టనున్న ధనుష్
అనగనగా మన విజయవాడ మహా నగరంలో నెలబడ్జెట్‌లో వెయ్యి రూపాయలు మిగిలిన పొంగిపోయే నాన్న, సీరియల్స్‌లో ట్విస్ట్‌లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్‌ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. రైటర్ కావాలనుకున్న సుహాస్ కల కలగానే మిగిలిపోతుందా? సుహాస్ లైఫ్‌లో వచ్చే ట్విస్ట్ ఏంటి? సుహాస్ గర్ల్‌ఫ్రెండ్ తనను ఛీ కొట్టడానికి రీజన్ ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.గీతా ఆర్స్ట్ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read : Bollywood: హిందీ ఖైదీ టీజర్ వచ్చేది ఆరోజే…