రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం.. అవినీతి జరగలేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా ? అంటూ ఆయన సవాలు విసిరారు.. ఈ మధ్యే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..
ఉమ్మడి కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం నేడు వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో సుగవాసి వైసీపీలో చేరనున్నారు. మాజీ టీడీపీ నేత బాలసుబ్రమణ్యం ఇప్పటికే రాయచోటి నుండి విజయవాడకు బయల్దేరారు. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బాలసుబ్రమణ్యం జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. రాయచోటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సుబ్రహ్మణ్యం రాకతో.. వైసీపీకి…