PM Modi: ప్రధాన మంత్రిని కలిసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన యాత్రలో భాగంగా ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారికి పుస్తకాలను కూడా బహూకరించారని వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్ తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేసినట్లు నాగార్జున చెప్పారు. ఈ యాత్రలో రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారన్నారు. ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కొద్ది సమయాన్ని గడిసిన ప్రధాని వారితో ముచ్చటించారని వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
Read Also: India Power Consumption: దేశంలో పెరిగిన విద్యుత్ వినియోగం..
Also Read
ముఖ్యంగా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని విద్యార్థులకు సూచించినట్లు వారు తెలిపారు. పరీక్షలంటే భయపడవద్దని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని విద్యార్థులకు హితవు చెప్పారన్నారు. సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా పొదుపు చేయాలని కోరడంతో పాటుగా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి వాటి ద్వారా పొదుపును ప్రారంభించాలని ప్రధాని ఈ సందర్భంగానే విద్యార్థులకు సూచించారని నాగార్జున వెల్లడించారు. తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా ప్రధాని బహూకరించి వారితో ఫోటోలు దిగారని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు పార్లమెంటును సందర్శించగా అక్కడి అధికారులు పార్లమెంటులో ఎవరు ఎక్కడ కూర్చుంటారనే వివరాలను విద్యార్థులకు తెలుపుతూ పార్లమెంటు మొత్తాన్ని చూపించారని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!