క్రికెట్ ఆటలో ఎవరూ ఊహించని పలు రికార్డులు నమోదవుతుంటాయి. మైదానంలో ఎప్పటికప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు అవుతూనే ఉంటాయి. అలాంటి ఒక రేర్ రికార్డు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 145 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌లో ఎన్నడూ సాధించని రికార్డును ఓ టీమిండియా బౌలర్ బ్యాటింగ్‌లో బద్దలు కొట్టాడు. ఈ రికార్డు స్టార్ బ్యాట్స్‌మెన్‌లకు కూడా సాధ్యం కాలేదు. భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్)లో…
టీమిండియా యంగ్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంగ్లాండ్ టీమ్ ముద్దు పేరు పెట్టింది. ఈ ఆసక్తికర విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ టీమ్, ముఖ్యంగా బెన్ డకెట్, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను ‘మిస్టర్ యాంగ్రీ’ అని పిలుస్తారని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ వెల్లడించాడు. ఈ పేరు మైదానంలో సిరాజ్ దూకుడు వైఖరికి సంబంధించినదని అన్నాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్ట్‌లో డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత అతను కోపంగా…
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లెజెండరీ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పోల్చాడు. తన బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో ఎక్కువగా ఉందన్నాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ వేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందన్నాడు. బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ…
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి…
గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్‌లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.
Azmatullah Omarzai created an unwanted record T20 World Cup: అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 36 రన్స్ ఇచ్చుకున్నాడు. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ దెబ్బకు ఒమర్జాయ్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది.…
ఇదివరకు ప్రకటించిన లిస్ట్ లో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎంపికయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు జడేజా కూడా ఒక భారత ఆటగాడు. జడేజా బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నుండి క్యాప్ అందుకున్న ఫోటోలను పంచుకున్నారు. “ప్రత్యేక వ్యక్తి నుండి ప్రత్యేక క్యాప్” అనే పోస్ట్‌కు క్యాప్షన్ ను ఈ ఫోటోలకు జత చేసాడు…
Stuart Broad Signs Off With Six and Wicket Off His Last Balls in Test Cricket: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన టెస్టు కెరీర్‌కు చిరస్మణీయ ముగింపు పలికాడు. కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన బ్రాడ్ రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అదే సమయంలో క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు నెలకొల్పాడు. తాను ఎదుర్కొన్న ఆఖరి బంతిని…
స్టీవ్ స్మిత్ గీత దాటడానికి ముందు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వికెట్లను కొట్టినా... బెయిల్స్ కదిలే సమయానికి అతని బ్యాటు క్రీజు లోపలికి వచ్చిందని నిర్ధారణకు రావడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్లు ఇంత క్లియర్‌గా చూస్తారా? అనే విషయం ఇప్పుడే నాకు తెలిసిందంటూ స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ చేశాడు..