Producer : ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. రెండు దశాబ్దాల నుంచి ఈ బ్యానర్ నుంచి పెద్ద హిట్లు రాకపోవడంతో, వరసగా వచ్చిన భారీ ఫ్లాపులు సంస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసాయి. ప్రస్తుతం ఈ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ప్రచారం జరుగుతుందుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలో హిట్ ఇచ్చిన బ్యానర్ ఇప్పుడు అనేక సంవత్సరాలుగా ఫ్లాపులు మాత్రమే అందుకుంది. అయినా ఈ బ్యానర్ ఇంకా వరుసగా సినిమాలు చేస్తోంది.. దీంతో వీళ్లకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో అని చెవులు కొరుక్కుంటున్నారు.
Read Also:Manchu Manoj : మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
ప్రతి ఏడాది భారీ యాక్షన్ హీరోతో తీసిన చిత్రం కూడా భారీ డిజాస్టర్‌గా మారింది. దీంతో సంస్థకు మరింత నష్టాలు కలిగాయి. ఈ సినిమా జీరో వసూళ్లతో డిజాస్టర్ గా మారడం సంస్థను మరింత దిగజార్చింది. అయినప్పటికీ, ఈ బ్యానర్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. వారం తరువాత వారం ఫ్లాపులతో కూడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు.
Read Also:Farm House Case: తొల్కట్ట ఫామ్‌హౌస్ కేసులో కీలక ట్విస్ట్!
ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి ఒక బాలీవుడ్ యువ హీరో నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ హీరో సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద క్రేజ్ లేకుండా ఫ్లాప్ సినిమాలతో పర్యటిస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్, భూమి పేడ్నేకర్ వంటి అందాల భామలు నటించినప్పటికీ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ లేదు. ఈ సినిమా కూడా మళ్లీ ఒక ఫ్లాప్ అవుతుందని అభిమానులు, సినీ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వారం రోజుల్లో విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం విజయం సాధిస్తుందా లేదా అనేది ఇంకా అనుమానంగా మారింది. అంతగా క్రేజ్ లేని హీరో, ఫ్లాపుల్లో ఉన్న బ్యానర్, ఫేడవుట్ హీరోయిన్లతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధించగలుగుతుందో అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఇంకా సమయం తేలుస్తుంది.