మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబుపై ఆయన యూనివర్సీటీలోని దౌర్జన్యాలతో కీలక కామెంట్స్ చేసాడు. మనోజ్ మాట్లాడుతూ ‘ జగన్నాధ్ సినిమా ఈవెంట్ కోసం రాయచోటి వెళ్ళాను. ఆ ఆడియో ఫంక్షన్ సమయంలో నన్ను కావాలని తోక్కేస్తున్నారని మాట్లాడాను. నా మద్దతుగా ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. లోన్ తీసుకుని అప్పులు చేసి షాపులు పెట్టుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. యూనివర్సిటీలోని హేమాద్రి నాయుడు నా వాళ్ళని కోట్టి మరి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
Also Read : Rachita Ram : పొరిగింటి పుల్లకూర వద్దంటున్న కన్నడ భామ.!
MBU పిఆర్వోగా ఉన్న వ్యక్తి ఆడవాళ్ళును టార్గెట్ గా చేసుకుని ఈ పనులు చేస్తున్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. తెలంగాణ లో బౌన్సర్లు లేకుండా చూశారు. కానీ ఇక్కడ యూనివర్శిటిలో మాత్రం వందలమంది బౌన్సర్స్ రాత్రి అయితే మందు తాగి నానా రచ్చ చేస్తు స్టూడెంట్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే బౌన్సర్లు వర్శిటి వద్ద నాకు మద్దతు గా ఉన్న వారి షాపులపై కర్రలు,రాడ్డులతో దాడు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఈ ఘటమపై స్పందించాలీ. స్దానికులకు దైర్యం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పై ఉంది. యూనివర్సిటీలో బౌన్సర్స్ లేకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పైనా ఉంది. అందిరికి ప్రేమను పంచండి ద్వేషాన్ని కాదు. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తాను’ అని అన్నారు.