Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చిరు కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
Rama Banam: వైలెంట్ గా ‘రామబాణం’ వదిలిన గోపీచంద్.. గుచ్చుకుంటుందా..?
పోస్టర్ లో చిరు ఢమరుకం పట్టుకొని డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ లో చిరు ఎంతో యంగ్ గా కనిపించి ఆకట్టుకుంటున్నాడు. స్ట్రీక్ ఆఫ్ శంకర్ పేరుతో ఈ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్న చిరు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.