షేర్ మార్కెట్ పేరుతో 2.11 కోట్లు మోసం చేసి 5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న మోసగాన్ని రామగుండం సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసి 5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు రవి వద్ద నుంచి క్రెడిట్ కార్డ్స్,బ్యాంక్ పాస్ బుక్స్, చెక్ బుక్స్, 8,100 నగదు, రిజిస్టర్ బుక్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : Nabha Natesh : నడి రోడ్డుపై స్టన్నింగ్ పోజులతో రెచ్చిపోయిన ఇస్మార్ట్ బ్యూటీ..
నిందితుడు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చు మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు ఎక్కువ లాభాలు రోజువారీగా, వారం రోజుల వారీగా, నెల వారీగా అధిక మొత్తం లో లాభంతో డబ్బులు ఇస్తాను అని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి 50 మంది వద్ద నుండి సుమారు 2.11 కోట్ల డబ్బులు వసూల్ చేయడం జరిగిందని రేమా రాజేశ్వరి తెలిపారు. వసూలు చేసిన డబ్బులలో కొంత షేర్ మార్కెట్ లో పెట్టగా నష్టం రాగా.. కొంత డబ్బు తన స్వంతంగా వాడు కోవడం జరిగింది అని తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు.
Also Read : Ashtadigbandhanam Trailer: అహంతో మొదలైన యుద్ధం అప్పుడే ముగుస్తుంది!