SSMB29 Rudra: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29 నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వింత వేషధారణ, అద్భుతమైన మేకోవర్‌తో కనిపించిన ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది నెటిజన్లు కుంభ లుక్‌పై ట్రోలింగ్ చేసినా.. రాజమౌళి సైంటిఫిక్ అప్రోచ్‌తో ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నాడని అభిమానులు విశ్వసిస్తున్నారు.
Divorce Case: “నా భార్యకు కుక్కలు అంటే ప్రేమ, దయచేసి విడాకులు ఇప్పించండి..”
ఇక మరోవైపు తాజాగా దర్శకుడు రాజమౌళి మరో సర్ప్రైజ్‌ను అందించారు. చిత్రంలోని హీరోయిన్ ప్రియాంక చోప్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. పసుపురంగ చీరలో తుపాకీతో ఫైరింగ్ చేస్తూ కనిపించింది. ఈ చీరకట్టులో చేతిలో గన్ పట్టుకుని బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఆ లుక్‌కి అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక సినిమాలో ప్రియాంక పాత్ర పేరును ‘మందాకిని’ అని వెల్లడించారు. ఇప్పటివరకు ఆమెను మోడర్న్ పాత్రలో చూపిస్తారని అనుకున్న అభిమానులు, ఇప్పుడు సంప్రదాయ చీరకట్టు లుక్‌లో కనిపించిన ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు.
Fake Notes : హైదరాబాద్ లో నకిలీ నోట్ల కలకలం..
ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అందరి చూపు మహేష్ బాబు లుక్‌పై పడింది. ఆయన ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదండోయ్.. ఈ చిత్రానికి ‘రుద్ర’ అనే టైటిల్ ఫిక్స్ అవుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. సినిమాలో కుంభ, మందాకిని లుక్స్ ఇప్పటికే విడుదల కావడంతో.. ఫ్యాన్స్ ఇప్పుడు రుద్ర ఫస్ట్ లుక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం నవంబర్ 15న జరగబోయే స్పెషల్ ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్ గ్లిమ్స్‌ను రిలీజ్ చేయడానికి రాజమౌళి సిద్ధమవుతున్నాడు. ఈ పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.