SSMB29 Rudra: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29 నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆయన ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వింత వేషధారణ, అద్భుతమైన మేకోవర్‌తో కనిపించిన ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.…