దర్శకుడు శ్రీవాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తెలుగు లో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ,పాండవులు పాండవులు తుమ్మెద,లౌక్యం మరియు డిక్టేటర్ లాంటి మంచి కుటుంబ కథా చిత్రాలు తీసి మంచి విజయాల ను అందుకున్నాడు.రీసెంట్ గా గోపి చంద్ హీరో గా రామబాణం అనే సినిమా ను తెరకెక్కించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరించింది.దాంతో ఆయన సినిమాల కు కాస్త గ్యాప్ తీసుకున్నారు.అయితే ఈ దర్శకుడు కి నటుడు గోపిచంద్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది.వీళ్లిద్దరి కాంబో లో వచ్చిన లక్ష్యం మరియు లౌక్యం రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి ఇక అదే ఊపు లో రామబాణం సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని భావించారు.కానీ ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.దాంతో వీరి కాంబో లో హాట్రిక్ హిట్ మిస్ అయింది.
దీనితో ఆయన మరో స్టార్ హీరో తో సినిమా తీసి సక్సెస్ అవ్వాలని చూస్తున్నట్లు సమాచారం… ఇప్పుడు ఆయన ఏ హీరో తో సినిమా చేస్తున్నాడు అనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. గతం లో స్టార్ హీరో వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అది వర్క్ ఔట్ కాలేదు.కానీ ఈసారి మాత్రం కచ్చితంగా వెంకటేష్ తో సినిమా ఉంటుంది అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.అయితే ఈ దర్శకుడు వెంకటేష్ తో చేసే సినిమా ఏ జానర్ లో ఉంటుందో తెలియాల్సి ఉంది.అయితే వెంకటేష్ తో సినిమా కుదరకపోతే స్టార్ హీరో నాగార్జున తో సినిమా చేయడానికి మరో కథ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..మరి దర్శకుడు శ్రీ వాస్ వీరిద్దరి స్టార్ హీరోల లో ముందు గా ఎవరితో సినిమాను చేస్తాడో చూడాలి.