ఇక జానూ పాపకు బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ది షూట్‌కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వీ. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైమ్ పాస్ చేస్తోన్న ఈ స్టార్ కిడ్.. నెక్ట్స్ టూ ఆర్ త్రీ మంత్స్ మాత్రం ఊపిరి సలపనంత బిజీగా మారిపోనుంది. ఎందుకంటే మేడమ్ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్‌పై సందడి స్టార్ట్ చేసింది జాన్వీ కపూర్.
Also Read : Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి ఇబ్బంది తప్పదు
పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి చిత్రాలతో థియేటర్లపై దండయాత్రకు రెడీ అయ్యింది. సిద్దార్థ్ మల్హోత్రా పరమ్ సుందరి జులై 25నే రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయి ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇలా డేట్ ఎనౌన్స్ చేసిందో లేదో ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అలాగే సన్నీ సంస్కారీ తులసి కుమారీ సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 2కి వాయిదా పడింది. ఇక కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హౌంబౌండ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. దడక్ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బోనీ- శ్రీదేవి తనయ జాన్వీ ఆ మూవీతో వంద కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. ఓటీటీ ఫిల్మ్స్‌కు ఎక్కువ కమిట్ కావడం.. థియేటర్లలో వచ్చిన సినిమాలు బోల్తా పడటంతో మరో బ్లాక్ బస్టర్ చూడలేదు. తెలుగులో దేవరతో భారీ హిట్ అందుకున్న అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి చేరిపోయింది. ఇక ఓన్ ఇలాకాలో ఫ్రూవ్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీటౌన్‌లో ఏడేళ్లుగా హిట్ చూడని జానూకు సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖట్టర్లలో లక్కీ మ్యాన్ ఎవరవుతారో చూడాలి.