Sri Sathyasai Bride Suicide: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పెళ్లి చేసుకున్న యువతి.. రాత్రి ఫస్ట్ నైట్ సమయానికే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సోమవారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికులు తెలిపిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి…
సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షిత (22). హర్షితకు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో ఇటీవల పెళ్లి నిశ్చయించారు. సోమవారం ఉదయం హర్షిత, నాగేంద్రల వివాహం ఘనంగా జరిగింది. నూతన జంటకు ఫస్ట్ నైట్ వేడుక కోడం కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో హర్షిత గదిలోకి వెళ్లి పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హర్షిత ఎంతసేపటికి గదిలో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. బంధువులు గది తలుపులు పగలగొట్టారు.
Also Read: Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి హర్షితను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే నవవధువు హర్షిత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే హర్షిత ఆత్మహత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. హర్షిత ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. ఎస్సై రమేశ్‌బాబు మాట్లాడుతూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.