తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన ఎములాడ (వేములవాడ) రాజన్న సన్నిధిలో శ్రీ రామ నవమి సందర్భంగా శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.శ్రీ రాములోరి కళ్యాణ ఘట్టం తిలికించడానికి తెలంగాణ జిల్లాలతో పాటు అంధ్రప్రదేశ్, మహరాష్ర్ట, తదితర ప్రాంతాల నుండి సుమారు లక్ష మంది భక్తులు, శివ పార్వతులు, జోగినిలు, హిజ్రలు హజరయ్యారు.. ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతరామచంద్రమూర్తికి పంచోపనిషత్తు ద్వార అభిషేకాలు నిర్వహించారు. శ్రీ సీతరామమూర్తి స్వామి వారి ఆలయం నుండి కళ్యాణ వేదిక వద్దకు జానకీ రాములను పల్లకి సేవలో తీసుకువచ్చారు.
Ayodhya Ram madir: ప్రధాని మోడీ స్పూర్తితోనే ‘‘సూర్య తిలకం’’ ఆచారం: అయోధ్య ట్రస్ట్..
ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య దాదాపు 3 గంటలకు పైగా ఈ వివాహ మహోత్సవం వేడుకలు జరిగాయి. ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట అందంగా పూలతో అలంకరించిన కళ్యాణ వేదికలో వేద మంత్రోత్సవాల మధ్య శ్రీ జానకీ రాముల కళ్యాణం జరుగుతుంటే మరో వైపు ఇక్కడ జోగినిలు, శివపార్వతులు ఓకరిపై ఓకరు తలంబ్రాలు పోసుకుంటు శివుడిని అంకింతం అయిపోయారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ను హారి హర క్షేత్రం అని కూడ అంటారు. ఇక్కడ శివుడి ఆలయంలో శ్రీ సీతరాముల కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం.