ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తాచాటారు. షాహీన్ అఫ్రిది 3, హుస్సేన్ తలత్ 2 వికెట్స్ తీయడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ మాత్రమే చేసింది. కమిండు మెండిస్ (50; 44 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (17), వానిండు హసరంగా (15) రాణించడంతో లంక ఆ మాత్రం స్కోరైనా చేసింది.…
టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని ఫీట్‌ను శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ సాధించాడు. మెండిస్ తన అర్ధసెంచరీని పూర్తి చేసిన వెంటనే.. తన పేరిట ప్రత్యేక ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. అతని అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ నుండి వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో 50 ప్లస్ పరుగులు చేశాడు.
Kamindu Mendis All-Time Test Records: గాలే అంతర్జాతీయ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత సెంచరీ చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కమిందు.. 173 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. శ్రీలంక 29 ఓవర్లలో 89/3 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన కమిందు.. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 302కు చేర్చాడు. కమిందు ఒక్క శతకంతో ఏకంగా ఐదు రికార్డులు…