Sreeleela: శ్రీలీలకు బంపరాఫర్.. సూపర్ హిట్ హీరోతో ఛాన్స్?
- కిస్సిక్ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలీల
- అన్‌స్టాపబుల్ షోకి శ్రీలీల
- శివ కార్తికేయన్‌తో ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. పుష్ప 2 ‘కిస్సిక్’ సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే జోష్‌లో బాలయ్య బాబు ‘అన్‌స్టాపబుల్’ షోకి కూడా హాజరయ్యారు. అయితే ఈ షోకే ఎవరూ ఊహించని యంగ్ హీరోతో శ్రీలీల వెళ్లారు. అతడే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. గతంలో ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఈ జంట నటించాల్సింది కానీ.. కుదరలేదు. ఈ సినిమా అటకెక్కిందనే టాక్ కూడా ఉంది. త్వరలో ఈ కాంబో సెట్ అవుతుందో లేదో తెలియదు గానీ.. అన్‌స్టాపబుల్ షోకి నవీన్, శ్రీలీల హాజరయ్యారు.
సరికొత్త పంథాలో దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాబుల్ సీజన్ 4లో నవీన్, శ్రీలీలతో రచ్చ చేయనున్నారు. త్వరలో ఆహాలో స్ట్రీమింగ్కు రానున్న ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. శ్రీలీలకు ఓ బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీను సంప్రదించగా నో చెప్పారు. కానీ ఈసారి హీరోయిన్గా శివ కార్తికేయన్‌తో ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తోంది.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: Mahesh Babu: హిందీ బిగ్‌బాస్‌లో మహేష్ బాబు టాపిక్.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?
శివ కార్తికేయన్ ఇటీవల అమరన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పురనానూరు’ టైటిల్‌తో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీల ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఏదేమైనా.. శ్రీలీల ఓ రేంజ్లో దూసుకుపోతోందనే చెప్పాలి. రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే ఆమెను ఆపడం ఎవరివల్ల కాదు.
తాజావార్తలు
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..