Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- హార్ముజ్‌లో వాణిజ్య నౌకపై దాడి..
- 11 మంది భారతీయులకు గాయాలు..
- ఆస్పత్రికి తరలించిన ఒమన్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Strait: హార్ముజ్ జలసంధిలో మరోసారి భారతీయ నావికులు ఉన్న నౌకపై దాడి జరిగింది. పనామా జెండా కలిగిన ఎంటీ ఆన్ పీస్ నౌకపై మంగళవారం ఒక ప్రొజెక్టైల్‌తో దాడి జరిగింది. ఈ దాడిలో గాయపడిన 12 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్ తీరానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన నావికుల్ని ఒమన్ అధికారుల సహాయంతో నౌక నుంచి తరలించి ఖసబ్ ప్రాంతంలోని ఆస్పత్రికి తరలించారు. నౌకలో 17 మంది భారతీయులతో సహా మొత్తం 19 మంది సిబ్బంది ఉన్నారు.
వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. భారతీయ నావికుల్ని తరలించడానికి సహకరించిన ఒమన్ అధికారులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ థాంక్స్ తెలిపింది. హార్ముజ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో నౌక ప్రయాణాలు, వాణిజ్య కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఈ దాడుల్ని తక్షణమే నిలిపేయాలని పిలుపునిచ్చింది.
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
హార్ముజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయి. అక్టోబర్ మొదటి వారంలోనే 7 ట్యాంకర్లు దాడులకు గురయ్యాయి. ఇరాన్-అమెరికా శాంతి చర్చలు విఫలమైన తర్వాత, అమెరికా జలసంధిని దిగ్బంధించిన నేపథ్యంలో నౌకలపై దాడులు పెరిగాయి. జూలైలో ఒమన్ ప్రాదేశిక జలాల్లో యూఏఈకి చెందిన రెండు నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో నలుగురు భారతీయ సిబ్బంది మరణించగా, 10 మంది గాయపడ్డారు. సెప్టెంబర్ 23న మరో దాడివలో మరో భారతీయ నావికుడు మరణించారు.
తాజావార్తలు
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!