Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో విదేశాల్లో ఉద్యోగాల వీసాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన కేటుగాళ్లు, నిరుద్యోగుల నుంచి విడతల వారీగా సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్లేస్మెంట్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నరేష్ కుమార్‌తో వారికి పరిచయం ఏర్పడింది. అదే ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్న రోజుల్లో నరేష్ కుమార్ చెప్పిన మాయమాటలను నమ్మి బాధితులు పూర్తిగా మోసపోయారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ కుమార్ లయోలా కళాశాలలో పనిచేస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను ఆసరాగా చేసుకుని నరేష్ కుమార్‌తో పాటు మరికొందరు కేటుగాళ్లు కలిసి ఎనిమిది మంది నుంచి విడతల వారీగా రూ. 50 లక్షలు వసూలు చేశారు.
Also Read
- Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
- US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
- IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
- 8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
చెన్నైకి చెందిన అరుణ్ కుమార్, ఉదయ్ కుమార్, సెంథిల్ కుమార్ తదితరుల బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బులు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లు బాధితులు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. డబ్బులు వసూలు చేయడమే కాకుండా.. బాధితుల ఒరిజినల్ పాస్‌పోర్టులను కూడా బలవంతంగా తీసుకుని, వాటిని వెనక్కి ఇవ్వకుండా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితులు వాపోయారు.
ఉద్యోగాల కోసం తాము కష్టపడి సంపాదించిన లక్షలాది రూపాయలను కోల్పోవడమే కాకుండా.. పాస్‌పోర్టులు కూడా చేతిలో లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ డబ్బులను, పాస్‌పోర్టులను ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు విజయవాడ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను చట్టపరంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!